డాక్టర్ సలహా… ముందుకొచ్చిన యువకులు
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి : పట్టణంలోని టౌన్ బోస్ నగర్ కి చెందిన చిన్నక్క అనే గర్భిణీకి (B+) రక్తం అవసరం కాగా ఆమె కుటుంబీకులు హెల్పింగ్ హాండ్స్ సొసైటీ చైర్మన్ ,బ్లడ్ నేషనల్ ప్రమోటర్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ను సంప్రదించారు. ఇందుకు స్పందించిన ఆయన సంతోష్, ఖాజా అనే యువకులతో రక్తదానం చేయించారు. కార్యక్రమంలో సొసైటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షాహీల్ మరియు కమిటీ సభ్యలు ఆసిఫ్,నాగార్జున, సన్నీ,ప్రతాప్,సంతోష్, తదితరులు పాల్గొన్నారు.