ఆగస్టు 15 నుంచి మీ ఇంటికే డాక్టర్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం అమలుకు వైద్య, ఆరోగ్య శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశా వర్కర్, ఏఎన్‌ఎం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఎంఎల్‌హెచ్‌పీ , పీహెచ్‌సీ వైద్యుడు.. ఇలా వీరందరి విధులు, బాధ్యతలను ఎస్‌ఓపీలో పొందుపరిచారు. ఎస్‌ఓపీపై జిల్లాల్లో అధికారులు, వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్యం, ఆరోగ్య సంరక్షణ కోసం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఈ విధానం అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిశ్చయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.