NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్టర్ దంపతుల హ‌త్య..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: న‌డిరోడ్డులో డాక్టర్ దంప‌తుల‌ను హ‌త్య చేశారు. ఈ దుర్ఘట‌న‌లో రాజ‌స్థాన్ లోని భ‌ర‌త్ పూర్ లో జ‌రిగింది. న సందీప్ గుప్త, సీమా గుప్త దంప‌తులు భ‌ర‌త్ పూర్ లో వైద్యులుగా ప‌ని చేస్తున్నారు. కారులో వెళ్తుండ‌గా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వ‌చ్చి.. కారుకు అడ్డంగా ఆపారు. ఒక వ్యక్తి బైక్ మీద నుంచి దిగి కారు దగ్గరికి వెళ్లాడు. సందీప్ గుప్తా కారు అద్దం కిందికి దింపాడు. వెంట‌నే ఆ వ్యక్తి కారులో ఉన్న సందీప్ గుప్త, సీమా గుప్త మీద తుపాకీతో కాల్పులు జ‌రిపాడు. సందీప్ గుప్త దంప‌తులు అక్కడిక‌క్కడే మ‌ర‌ణించారు. దుండ‌గులు అక్కడి నుంచి ప‌రారీ అయ్యారు. ఘ‌ట‌న తాలూకు వీడియో అక్కడి ట్రాఫిక్ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

About Author