NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్ట‌ర్లు.. మందులు రాసేట‌ప్పుడు పెద్ద అక్ష‌రాల‌తో రాయాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఫీజులు రోగులకు అందుబాటులో ఉండాలని జాతీయ వైద్య కమిషన్‌ పేర్కొంది. డాక్టర్‌ ఫీజు, కన్సల్టేషన్, రిఫండ్‌ వంటి వివిధ అంశాల ఆధారంగా ఫీజులు వసూలు చేయకూడదని, అలాంటి వాటితో రోగికి సంబంధం లేదని స్పష్టం చేసింది. వైద్య నియమావళిలో పలు కీలక మార్పులు చేస్తూ, వైద్య సేవలకు సంబంధించి కొత్త నిబంధనలు విధిస్తూ, వైద్యులకు పలు సూచనలు చేస్తూ.. ఎన్‌ఎంసీ ముసాయిదాను రూపొందించింది.

ఎన్ఎంసీ సూచ‌న‌లు :

  • కార్పొరేట్‌ ఆసుపత్రులు తాము అందించే వైద్య సేవలను మాత్రమే తెలియజేయాలి. దాని ఫీజును చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ల పేరుతో ప్రచారం చేయకూడదు.
  • జనరిక్‌ పేరుతోనే మందులు రాయాలి , కానీ కంపెనీ పేరుతో రాయకూడదు. మందులు రాసేటప్పుడు పెద్ద అక్షరాల్లో (క్యాపిటల్‌ లెటర్స్‌) అర్ధమయ్యేట్లు రాయాలి.
  • ఫార్మాస్యూటికల్‌ కంపెనీల నుంచి డాక్టర్లు ఎలాంటి బహుమతులు పొం దకూడదు. ఐదేళ్లకోసారి ఆ మేరకు అఫిడవిట్‌ సమర్పించాలి. ఒకవేళ పొం దితే దాన్ని వెల్లడించాలి. కంపెనీల ప్రభావానికి లోనుకాకూడదు. కాన్ఫరెన్స్‌లు, సెమినార్లకు కూడా కంపెనీల స్పాన్సర్‌షిప్‌ తీసుకోకూడదు.
                                      

About Author