చికెన్ నుంచి బ్లాక్ ఫంగస్ వస్తుందా..?
1 min readపల్లెవెలుగు వెబ్: సోషల్ మీడియాలో ఆధారంలేని రకరకాల వార్తలు, విషయాలు సర్క్యులేట్ అవుతుంటాయి. చికెన్ తింటే బ్లాక్ ఫంగస్ వస్తుందనేది కూడ అలాంటిదే. గాల్లో ఉన్న బ్లాక్ ఫంగస్ కోళ్లకు సోకి.. ఆ కోళ్ల నుంచి చికెన్ తినే మనుషులకు కూడ సోకుతుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ వార్త పూర్తీగా అబద్ధమని ఐసీఎంఆర్ సీనియర్ సైంటిస్ట్ అపర్ణ ముఖర్జీ చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ అనేది అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని ఆమె స్పష్టత ఇచ్చారు.