PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేగా గెలిచే సత్తా పవన్​కళ్యాణ్​కు ఉందా.? కొడాలి నాని

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: 2014లో ఎమ్మెల్యేగా గెలిచే సత్తా పవన్​కళ్యాణ్​కు ఉందా.. అంటూ ఏపీ మంత్రి కొడాలినాని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్​కళ్యాణ్​ చేస్తోన్న వ్యాఖ్యలకు మంత్రి కొడాలి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్ప్రప్ట్​ను చదివే వ్యక్తికి మమ్మల్ని భయపెట్టడం సాధ్యమేనా అని ఎద్దేవా చేశారు. వైసీపీ 151సీట్ల నుంచి 15సీట్లకు పడిపోయే వీలు లేకపోలేదనండం, నేను ఇప్పటినుంచి రాజకీయాలంటే ఏంటో చూపిస్తానంటున్న పవనకళ్యాణ్​ అన్ని పార్టీలతో కలిసి రావాలసి సవాల్​ విసిరారు. నువు జీవితంలో వైసీపీని ఓడించలేవని, జగన్​ను మాజీని చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఘాటైన వ్యాఖ్యలు సందించారు. పవన్​కళ్యాణ్​ చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏదేమైనా జనసేన అధినేత పవన్​కళ్యాణ్​ రెండు స్టేజీల్లో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతలపై చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరు తమదైన శైలిలో మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు.

About Author