రామోజీకి ఇంగితజ్ఞానం వుందా.. లేదా..?
1 min readకులదురంహంకార రాతలకు రామోజీ క్షమాపణలు చెప్పాలి.
యస్.సి.,యస్.టి.,బి.సి, మైనారిటీ, బడుగు బలహీనవర్గాల పిల్లల భవిష్యత్ గురించి మన జగనన్న విద్యా విధానంలో ప్రవేశపెట్టిన బైజూస్ కంటెంట్, ట్యాబులపై అసంబద్ధమైన,అశుద్ధమైన, రాతలు రాసిన రామోజీ రావు క్షమాపణ చెప్పాలి.
పెత్తాందారులు ట్యాబులు వాడితే విజ్ఞానం కోసం..!
పేదలు వాడితే పోర్న్ వీడియోల కోసమా..!
రామోజీకి ఇంగితజ్ఞానం వుందా!! లేదా!!!
కులదురంహంకార రాతలకు రామోజీ క్షమాపణలు చెప్పాలి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: యస్.సి.,యస్.టి.,బి.సి, మైనారిటీ, బడుగు బలహీనవర్గాల పిల్లల భవిష్యత్ గురించి మన జగనన్న విద్యా విధానంలో ప్రవేశపెట్టిన బైజూస్ కంటెంట్, ట్యాబులపై అసంబద్ధమైన,అశుద్ధమైన, రాతలు రాసిన రామోజీ రావు క్షమాపణ చెప్పాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటన లో ఎమ్మెల్యే ఆర్థర్ స్పందించారు.పేద పిల్లలకు గవర్నమెంటు స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టినప్పుడూ ఇలాగే వ్యతిరేకించారు. మీ పిల్లలు, మీ మనవలు తెలుగు మీడియంలో చదువుతున్నారా..? మా పిల్లలు మాత్రం చదవాలని ఎలా అంటారు.?. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గవర్నమెంటు స్కూళ్ళలో తమ పిల్లల్ని చదివిస్తూ ఎప్పటికీ పనివారిగానే మిగిలిపోవాలా..?ఇంగ్లీషు లిటరసీ, డిజిటల్ లిటరసీ.. మా పిల్లలకు అబ్బితే మీకు పొలాల్లో కూలీలు, ఇళ్ళల్లో పనివాళ్ళు దొరకరన్న పెత్తందారీ భావజాలంతో మా పిల్లల మీద నింద వేస్తారా..?
మా పిల్లలు పోర్న్ చూస్తున్నారా..?
తల్లిదండ్రులుగా మీ కంటే ఎక్కువ బాధ్యతగా మా కష్టంతో, మా పిల్లల్ని పెంచుకునే కులాలు మావి. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేదల పిల్లలంతా రూపాయి విలువ తెలిసి, చదువు విలువ తెలిసి, కష్టం విలువ తెలిసి పైకి వస్తారు. అటువంటి వారిమీద నిందలు వేస్తారా..?ట్యాబులు ఇస్తే ఏడుస్తారా..? ప్రపంచంలోకి వారు వెళ్ళేందుకు, ఇంగ్లీషు, డిజిటల్ లిటరసీని అడ్డుకోవడం కూడా ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కిందకు రాదా..?
మిమ్మల్ని అరెస్టు చేస్తే తప్పేంటి..?
ఈరోజు ఈనాడు పత్రికలో ” బైజూస్ కంటెంట్ తో విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు చెడిపోతున్నారు, ప్రైవేట్ వీడియోలు, పోర్న్ వీడియోలు చూస్తున్నారు, జగన్ పేద విద్యార్థులకు ట్యాబ్ లు అందించడం వల్ల విద్యార్థులంతా నాశనమైపోతున్నారంటూ, ” అశుద్ధమైన, అసత్యమైన వార్తను ప్రచురించారు.రామోజీని సూటిగా ప్రశ్నిస్తున్నా…ఎందుకయ్యా..! బడుగు, బలహీన వర్గాలపై మీకు ఇంత అసూయ, ఈర్ష్య, ద్వేషం. బడుగుబలహీన వర్గాల పిల్లలకు డిజిటల్ విప్లవంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం… సమర్థమైన పాఠ్యప్రణాళిక రూపొందించి, బైజూస్ కంటెంట్ తో, చదువుల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేలా ట్యాబ్ ల పంపిణీ చేస్తే.. ఎందుకంత విషం చిమ్ముతున్నారు. రామోజీ…?. మీకు ఏం అన్యాయం చేశామని మా బడుగు,బలహీన వర్గాల మీద ఈ విధంగా విషం చిమ్మి మీ పత్రికలలో అచ్చువేస్తున్నారు..?
పెత్తందారుల పిల్లలు ట్యాబులు చూడటం లేదా?
రామోజీకి కూడా మనవళ్లు, మనవరాళ్ళు ఉన్నారుకదా..! మీరు మాకంటే గొప్పగా అడ్వాన్స్ డ్ ల్యాప్ టాప్ లు, మ్యాక్ బుక్ లు, ఐప్యాడ్ లు, ట్యాబ్ లు వాడుతున్నారు కదా..!. మీ పిల్లలు మాత్రం విజ్ఞానం కోసం ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లు వాడుతుంటే.. మరి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ట్యాబ్ లు వాడి పోర్న్ వీడియోలు చూస్తున్నారని అంటారా?. మా బడుగు, బలహీన వర్గాల మీద మీకు ఎంత కడుపుమంట?మీకు దీటుగా, మా బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల చేతుల్లో ట్యాబ్ లను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు పెడుతుంటే, మా బిడ్డలు కూడా ఇంగ్లీషు మీడియం చదువులు చదువుకుంటుంటే.. ద్వేషంతో మీ కళ్ళు మండి, కడుపుమంటతో మా మీద విషపురాతలు రాస్తూ, వింత కూతలు కూస్తున్నారే, మేం మీకు ఏం అన్యాయం చేశాం?.ఒక యస్.సి.గా చెబుతున్నా గుర్తుపెట్టుకోండి.వారి బిడ్డలు మాత్రం ఉన్నతంగా చదువుతుంటే, వారి బిడ్డలు ల్యాప్ టాప్ లు, ట్యాబులు వాడుతుంటే వారికి రాని సమస్య, ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ,బడుగు బలహీనవర్గాల పిల్లలు వాడుతుంటే మాత్రమే వస్తుందా? అనే విషయం ప్రజలందరూ గమనించాలి. నిత్యం ప్రభుత్వంపై విషపు రాతలు రాస్తున్న ముసలాయన రామోజీకి సవాల్ విసురుతున్నాం. సుమారుగా 5.50లక్షల ట్యాబ్ లను ముఖ్యమంత్రి జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు ఇచ్చారు. దీనిపై ఎవరైనా బహిరంగ చర్చకు రమ్మనండి. కేవలం మన జగనన్న మీద విష ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి చెత్త వార్తలు రాస్తున్నారే తప్ప, వాస్తవం ఇసుమంతైనా లేదు. ప్రజలను మభ్యపెట్టెందుకు ఇటువంటి చెత్త రాతలను ఖండిస్తూ, విషపు రాతలు రాసిన రామోజీ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.