రష్యా వ్యక్తికి తెలిసిన విషయం కేంద్రానికి తెలియదా?
1 min readల్లెవెలుగు వెబ్: దేశంలో కరోన రెండో దశ కొనసాగుతున్న దశలో వ్యాక్సిన్ కొరత ఉండటం పట్ల ఢిల్లీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులను బాధ్యత గల పౌరుడిగా ఆవేదన కలుగుతోందని వ్యాఖ్యానించింది. వ్యాక్సిన్ ఒక్కటే కరోన నివారణకు మార్గమని చెబుతన్నప్పటికీ.. వ్యాక్సిన్ కొరత ఉండటం పట్ల విచారం వ్యక్తం చేసింది. భారత్ లో వ్యాక్సిన్ తయారీ కంపెనీల గురించి రష్యాలో ఉన్న వ్యక్తికి తెలిసిన విషయం కేంద్రానికి తెలియదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో కూడ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.