NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీ పిల్లల్లో టాలెంట్ ఉందా? వెంటనే వీడియో తీసి పోస్ట్ చేయండి..

1 min read

జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 7 ఆడిషన్స్ ప్రారంభం!

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త కార్యక్రమాలు అందించడంలో ముందుండే జీ తెలుగు ప్రతిభావంతులను ప్రోత్సహించడంలోనూ తన పాత్ర పోషిస్తుంది. జీ తెలుగు ప్రతిష్టాత్మక కార్యక్రమం డ్రామా జూనియర్స్ సరికొత్త సీజన్తో మీ ముందుకు వచ్చేస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన పిల్లలకు అవకాశం కల్పిస్తోంది. చిన్న పిల్లల్లో నటనా ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో డ్రామా జూనియర్స్ సీజన్ 7 ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే విజయవంతంగా 6 సీజన్ల ను పూర్తి చేసుకున్న డ్రామా జూనియర్స్ మరో సీజన్తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 3 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఇదే సువర్ణావకాశం. మీ పిల్లల్లోని ప్రతిభను గుర్తించి వారి భవిష్యత్తుకు బాటలు వేసేందుకు జీ తెలుగు మీకు అవకాశం అందిస్తోంది. మీ పిల్లలకు డ్యాన్స్, పాటలు పాడటం, నటన, మ్యాజిక్ ట్రిక్స్, మార్షల్ ఆర్ట్స్ తో పాటు మరేదైనా టాలెంట్ ఉన్నా ఇదే చక్కని అవకాశం. ప్రపంచవ్యాప్తంగా వివిధ నేపథ్యాలు, జీవనశైలిలో ఎదుగుతున్న ప్రతిభావంతమైన పిల్లలను గుర్తించే లక్ష్యంతో జీ తెలుగు ఛానల్ ఈ అవకాశాన్ని అందిస్తోంది.,జీ తెలుగు పాపులర్ షో డ్రామా జూనియర్స్ సీజన్ 7 ఆడిషన్స్ తో మునుపెన్నడూ లేని విధంగా బిగ్ స్టేజ్ పై మెరిసే ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు చేయాల్సిందేంటంటే.. పిల్లల్లోని టాలెంట్ని ప్రతిబింబించేలా 2 నిమిషాల నిడివి గల వీడియోను DramaJuniorsS7Auditions. Zee5.com లో పోస్ట్ చేయాలి. లేదా 9100054301 [email protected] $ 5 కూడా పంపించవచ్చు. లిప్ సింక్ ఉన్న వీడియోలు పరిగణనలోకి తీసుకోబడవని గమనించాలి.

About Author