కుక్కకాటుకు…40 గొర్రెలు మృతి
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బుదూర్ గ్రామం లో పిచ్చి కుక్క కాటుకు 40 గొర్రెలు మృతి చెందాయి .గొర్రెల పెంపకమే జీవనాధారంగా జీవనం చేయుచున్న గొర్రెల కాపరి కురువ దుబ్బన్న ను ప్రభుత్వం ఆదుకోవలెనని జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం .కే రంగస్వామి ,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ,మంత్రాలయం మండల కురువ సంఘం అధ్యక్షులు కే .మల్లికార్జున ,మండల ప్రధానకార్యదర్శి కే .బుదూర్ లక్ష్మన్న ,బుదూరు కురువ బీరప్ప డిమాండ్ చేసారు .కురువ దుబ్బన్న కు 3 లక్షలు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించవలెనని కోరారు.