PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం

1 min read

– బీపీ, సుగర్ వంటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం.

– యూని మనీ 19వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఉచిత వైద్య శిబిరంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కార్పొరేట్ వ్యాపార సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని యూని మనీ ఫారిన్ ఎక్స్చేంజి సంస్థ 19వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేకును కట్ చేశారు. అలాగే యూని మనీ సంస్థ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రపంచ మధుమేహ దినోత్సవంను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ఉచిత షుగర్, బిపి ,ఈసిజి పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు .ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యూనీ మనీ సంస్థ బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ యూని మనీ సంస్థ తమ వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తూనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ బిపి, షుగర్ వంటి సాధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, వాటిని నిర్లక్ష్యం చేస్తే సైలెంట్ కిల్లర్లుగా మరి మనిషి ప్రాణాలకే ప్రమాదం తీసుకువచ్చే ప్రమాదం ఉందన్నారు. చాలామంది తమ జబ్బులకు సంబంధించి స్పెషలైజేషన్ వైద్యుల దగ్గరికి వస్తారని, వారు చేసిన సాధారణ పరీక్షల్లో బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తేలుతుందని చెప్పారు. దీర్ఘకాలంగా వాడే నొప్పుల మాత్రల వల్ల కిడ్నీలు చెడిపోయి క్రియాటిన్ శాతం పెరిగే అవకాశం ఉందని వివరించారు .చాలా కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్తారని, కానీ చాలా సంస్థలు వాటిని విస్మరిస్తున్నాయని ఆయన చెప్పారు. అలా కాకుండా కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార లావాదేవీల ద్వారా వచ్చిన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు .ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత పేదలకు సదుపాయం కార్పొరేట్ స్థాయిలో అందుతుందని కొన్ని ప్రత్యేక సందర్భాలలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి పేదలకు వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక కారణాలతో పేదలు వైద్యానికి దూరంగా ఉండటం ఆహ్వాని సిద్ధంగా పరిణామం కాదని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ సొంత లాభాన్ని కొంత మానుకొని సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కోరారు . యూనీ మనీ సంస్థ విదేశాలకు వెళ్లే వారికి చేస్తున్న సహకారం మరువలేనిదని ,గత 19 సంవత్సరాలుగా ప్రజలకు వారు నమ్మకమైన సేవలు అందిస్తున్నారని వివరించారు. విదేశాలకు వెళ్లేవారు ఇలాంటి సంస్థల ద్వారా వెళ్తే ఎలాంటి సమస్యలు లేకుండా తమ టూర్లను విజయవంతంగా కొనసాగించవచ్చని  చెప్పారు. యూని మనీ సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ శంకర శర్మను సంస్థ ప్రతినిధులు శాలువా కప్పి సన్మానించారు.

About Author