ఇలా చేస్తే థర్డ్ వేవ్ రాదు : ఎయిమ్స్
1 min read
పల్లెవెలుగు వెబ్: ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు.. పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేస్తే థర్డ్ వేవ్ కు ఆస్కారం ఉండదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. థర్డ్ వేవ్ అనేది ప్రజలు వ్యవహరించే తీరు.. వ్యాక్సిన్ వేయడం పై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా.. ప్రభావం తక్కువ ఉంటుందని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ మిక్సింగ్ పై పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి పై మరింత డేటా అవసరమని గులేరియా తెలిపారు. దేశంలో కరోన కేసులు తగ్గాయని, మరణాల సంఖ్య కూడ తగ్గిందని అన్నారు. కొన్ని చోట్ల పాజిటివిటీ రేటు అధికంగా ఉందని అన్నారు.