అలా చేస్తే యుద్ధం ఆపుతాం : పుతిన్
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్‌తో యుద్ధం భీకరంగా జరుగుతోన్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో ఫోన్లో మాట్లాడారు. నాటోలో చేరకపోవడంతో పాటు తాము గతంలో చేసిన డిమాండ్లకు ఉక్రెయిన్ పూర్తిగా అంగీకరిస్తేనే సైనిక చర్యలు ఆపుతామని పుతిన్ తేల్చి చెప్పారు. కేవలం బలగాలను సమీకరించుకునేందుకు ఉక్రెయిన్ సంప్రదింపులను పొడిగిస్తూ పోతే సహించేది లేదని కుండబద్దలు కొట్టారు. తదుపరి విడత చర్చల్లో అయినా ఉక్రెయిన్ నిర్మాణాత్మక చర్చలు జరుపుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.