అలా చేయడం వల్ల.. భారత క్రికెట్ ప్రతిష్ట దిగజారుతుంది
1 min read
17/12/2021
పల్లెవెలుగువెబ్ : భారత క్రికెట్ వన్డే కెప్టన్ గా విరాట్ కొహ్లీని తొలగించి.. రోహిత్ శర్మకు బాధ్యత అప్పగించిన అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించారు. అనవసర వివాదాల వల్ల భారత క్రికెట్ ప్రతిష్ట దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎవరు నిజం చెబుతున్నారు.. అబద్ధం చెబుతున్నారు అన్నది ప్రశ్న కాదని, అసలు ఇలా ఎందుకు జరుగుతోందన్నది ప్రశ్న అని ఆకాశ్ అన్నారు. ఇలాంటి వివాదాల వల్ల భారత క్రికెట్ కు నష్టం జరుగుతుంది తప్ప.. వ్యక్తిగతంగా ఎవరికీ నష్టం కాదన్నారు. ఈ పుకార్లు పుట్టిస్తున్నది, ఇదంతా చేస్తున్నది ఎవరన్నది అర్థం కావడంలేదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు.