రక్తదానం చేయడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
1 min read– అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల బ్లడ్ బ్యాంక్ లో 70 మంది హౌస్ సర్జన్స్ మరియు వైద్య విద్యార్థులు (అవుట్ గోయింగ్ 2k17 బ్యాచ్) బ్లడ్ డొనేషన్ చేసినట్లు తెలిపారు.రక్తదానం చేయడం వల్ల ప్రజలకు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు దాత వారి శరీరాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది అని తెలియజేశారు.ఆసుపత్రిలో రక్తదానం చేయడం వల్ల ఎన్నో కేసులలో పేషంట్లను ప్రాణాలతో కాపాడగలిగాం అని తెలియజేశారు.ఆసుపత్రికి యువత ముందుకు వచ్చి రక్తదానం చెయ్యాలని సూచించారు. అనంతరం వారు మరో జీవితాన్ని కాపాడగలిగినవారైతారు అని తెలియజేశారు.ఆస్పత్రిలో ఈ బ్లడ్ డొనేషన్ చేసిన హౌస్ సర్జన్స్ మరియు వైద్య విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, హాస్పిటల్ అడ్మిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డెర్మటాలజీ విభాగపుఅధిపతి, డా.పెంచలయ్య బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, డా.శాంత, వైద్యులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి, గారు తెలిపారు.