శ్రీ వారికి వెండి కిరీటం విరాళం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక సంకల్ భాగ్‌లో వెలిసిన శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం నగరంలోని బోయ పద్మావతమ్మ దంపతులు అరకిలో వెండి కిరీటంను విరాళంగా అందజేశారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండేల్ చంద్ర శేఖర్ కు దాత పద్మావతమ్మ వెండి కిరీటాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా దేవాలయంలో దాత పద్మావతమ్మ పేరిట అర్చన చేసిన అర్చకులు… స్వామి వారికి వెండి కిరీటం అలంకరించారు. కార్యక్రమంలో కర్నూలు బ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరి నాగరాజు శర్మ, ఉప కార్యదర్శి సత్య నారాయణ రాజు, మేనేజర్ రాధాకృష్ణ, పూజారి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.