PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీరప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో  పెద్దపాడు దగ్గర  మోడల్ స్కూల్ ప్రక్కన నిర్మాణంలో ఉన్న శ్రీ బీర లింగేశ్వర స్వామి దేవాలయం మరియు గోపురం నిర్మాణానికి తమ వంతు సహకారంగా గ్రామ కులస్థులు 65 వేల రూపాయలు ,గాదె  కృష్ణ 25 వేల రూపాయలు,  మలేరియా సుంకయ్య 10 వేల  రూపాయలు సోమవారం ఉదయం కర్నూలు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శిఎం .కే . రంగస్వామి,బి .సి . తిరుపాల్,ఎల్లయ్య , తవుడు శ్రీనివాసులుకు గూడూరు మండలం కురువ సంఘం  అధ్యక్షులు కృష్ణ  మరియు గ్రామ కురువ కులస్థులు లక్ష రూపాయలు అందజేశారు. ఈ సమావేశంలోజిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి మాట్లాడుతూ శ్రీ  భీరలింగేశ్వర దేవాలయంతో పాటు కళ్యాణమండపం మరియు విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం, గదుల  నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉండే కురువ కులస్తులు తమ వంతు సహకారంగా నిర్మాణం సరిపడా డబ్బు మరియు ఇసుక ,సిమెంటు, స్టీలు అందజేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెంచికలపాడు గ్రామస్తులు ఎంపిటిసి మద్దిలేటి,కురువ నగేష్ ,కర్ణం చిన్న  గిడ్డయ్య, ఆటో రాముడు ,గోపాల్ ,తిప్పన్న ,తలారి  శంకరయ్య ,గజ్జెల సుంకన్న , కర్ణం యుగంధర్, గజ్జలు వెంకటేశ్వర్లు, శివన్న, లిక్ మధు   తదితరులు పాల్గొన్నారు.

About Author