PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీరప్పస్వామి దేవాలయం నిర్మాణానికి విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో పెద్దపాడు సమీపంలో ఎపి మోడల్ స్కూల్  ప్రక్కన నిర్మిస్తున్న శ్రీ శ్రీ భీర లింగేశ్వర దేవస్థానమునకు గూడూరు మండలం కె. నాగలాపురం గ్రామానికి చెందిన కురువ కులస్తులు ఏకమై తమ వంతు భాగంగా ప్రతి ఒక్కరు తమ భాగస్వామ్యం గుడి నిర్మాణంలో ఉండాలని తమకు దేవుడు ఇచ్చిన దానిలో కొంతైనా రుణం తీర్చుకోవాలని దేవాలయం నిర్మాణానికి  ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో  జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి రంగస్వామి ఆలయ కమిటీ సభ్యులకు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బి సి తిరుపాల్ ఎల్లయ్య గూడూరు మండల అధ్యక్షులు కిష్ట నాగలాపురం కురువ కులస్తులు సుంకన్న యుగంధర్ టి శ్రీనివాసులు మినాల్ల వై సుంకన్న నాగ సుంకన్న బండారి వెంకటరాముడు కరెంటు సుంకన్న గోవిందు మల్లికార్జున వేంకటేశ్వర్లు వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

About Author