శ్రీ సిద్ధ అజ్జా ఆలయ నిర్మాణానికి రూ.1,05,111 విరాళం
1 min read
ఉనకల్ గ్రామ భక్తుల సేవాభావం అభినందనీయం
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద గ్రామంలో సులభై రోడ్డులో నూతనంగా నిర్మాణం జరుగుతున్న శ్రీ శ్రీ సిద్ధ అజ్జా ఆలయానికి భక్తులు విరాళం అందించారు.హుబ్లీ జిల్లా ఉనకల్ గ్రామానికి చెందిన శ్రీ శ్రీ సద్గురు సిద్ధపజ్జ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి రూ.1,05,111 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులు నవ్వులే నగేష్ మరియు కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.ఆలయ నిర్మాణానికి భక్తులు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందించడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు మరింత వేగంగా కొనసాగుతాయని తెలిపారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు దేవాలయ నిర్మాణానికి కూడా భక్తులు సహకరిస్తూ సేవాభావాన్ని చాటుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి మరింత మంది భక్తులు, దాతలు తమ వంతు సహకారం అందించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.


