పాఠశాలకు కంప్యూటర్, ఫర్నిచర్,క్రీడా సామాగ్రి బహుకరణ
1 min read
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పేదవేగి మండలం.నడిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల కు అవసరమైన ఫర్నిచర్ , కంప్యూటర్స్ ను సర్పంచ్ మేక అప్పాయమ్మ విజ్ఞ్యప్తి మేరకు అడ్వాంట సీడ్ కంపెనీ వారు గురువారం బహుకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన హోటల్ ‘N’ సంస్తలు మరియు ఫౌండేషన్ అధినేత నారా శేషు పాల్గొని, ఫౌండేషన్ ద్వారా పాఠశాల విద్యార్థులు కు క్రీడా సామాగ్రిని బహుకరణ చెయ్యడం జరిగింది. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా చదువులో, క్రీడల్లో రాణించాలని. అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడ్వాంట కంపెనీ ప్రతినిధులు జోనల్ మేనేజర్ సంపత్,రీజినల్ ప్రొడక్షన్ మేనేజర్,మదన్ మోహన్ రెడ్డి,నర్సి రెడ్డి,ఎ రాజు మరియు గ్రామ నాయకులూ మేకా రమేష్,మట్టా వెంకటేశ్వర రావు, మట్టా రామ్మోహన్ రావు, మట్టా రంగ,సంజయ్ ప్రసాద్, మేక సంజయ్,శేషు టీం మేక నాగేశ్వర రావు, నాని,ఇళ్ల శ్రీనివాస్ రావు తదితరులు, గ్రామ ప్రజలు, పంచాయతీ వార్డు మెంబర్స్, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.