కర్నూలు జీజీహెచ్‌కు ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ విరాళం
1 min readఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి మాట్లాడుతూ:
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ మెడికల్ విభాగంలో కోవిడ్ సమయంలో లక్ష్మీబాయి అనే పేషెంట్ కు చేసిన సేవలకు వారి కుమార్తె అయిన ఉషరాణి(గుంతకల్ నివాసి) 1లక్ష రూపాయలు గల వైద్యపరికరాల కొనుగోలుకు మెడికల్ విభాగానికి విరాళం చేసినట్లు తెలియజేశారు.ఉషరాణి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఆస్పత్రిలో మెడికల్ విభాగం అద్భుతమైన సేవలు అందిస్తోందని, ఎంతో మంది పేదలు మెరుగైన వైద్యులు చేస్తున్న సందర్భంగా వారు తన వంతు సహాయం కింద విరాళం చేసినట్లు తెలిపారు.ఆసుపత్రిలో ప్రతిరోజు ఎంతో మంది పేదలుమెరుగైన వైద్యసేవలు పొందుతున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.సుధాకర్, మెడికల్ విభాగపు వైద్యులు డాక్టర్ రాజశేఖర్, డా.శ్రీరాములు, డా.లక్ష్మీబాయి, డా.విద్యాసాగర్, డా.దమం శ్రీనివాసులు, మరియు ఇతర వైద్యులు తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి తెలిపారు.