PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనాథలకు అన్నదానం..

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఆకలితో అలమటించే వారిని ఆదుకోవాలన్న సదుద్దేశంతో … ప్రతి శనివారం అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు దాత బాలస్వామి. కర్నూలు పట్టణానికి సమీపంలో ఉన్న జొహరాపురం గ్రామానికి చెందిన బాలస్వామి… అనాథల ఆకలికష్టాలను చూసి చలించిపోయారు.  ఇంటి దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో  అనాథలు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులు కూడా సహకరించడంతో ప్రతి శనివారం తన స్వగృహం ఆవరణలో కులమతాలకతీతంగా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. తనకున్న కొద్దిపాటి పొలంతోపాటు మరికొద్దిగా కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్న బాలస్వామి… భవిష్యత్​లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

About Author