గాడిదలకు.. పెళ్లి..!
1 min read– హోసూరులో వింత ఆచారం
పల్లెవెలుగు వెబ్, పత్తికొండ : కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో గురువారం గ్రామస్తులంతా కలిసి వర్షం కురవాలని గాడిదలకు కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వాసు దేవుని కృప తో వరుణ దేవుడు కరుణించి వర్షం కోసం గ్రామస్తులు గాడిదలకు ఘనంగా కళ్యాణం జరిపించి తమ వింత ఆచారాన్ని చాటుకున్నారు . ముందుగా రెండు గాడిదలను ఊరేగించారు. అనంతరం వీరభద్ర స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించి మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య గాడిదలకు వివాహం జరిపించారు.
ఉత్తర కార్తె ముగుస్తున్న ప్పటికీ తగిన మోతాదులో వర్షాలు రాకపోవడం తో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని గ్రామస్తులు వాపోయారు. శాస్త్రాల ప్రకారం వాసు దేవుని వాహనమైన గాడిదలకు వివాహం జరిపిస్తే వరుణుడు కరుణించి వర్షం కురిపిస్తాడని ఆశతో ఈ వేడుకను జరిపిస్తున్నా మని గ్రామస్తులు తెలిపారు. గాడిదల వివాహ కార్యక్రమానికి గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్దయెత్తున పాల్గొన, వేడుకను తిలకించి, తరించారు.