PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ పెద్దింటి అమ్మవారి కి  వెండి కిరీటం దాతలు బహుకరణ

1 min read

కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం, తీర్థప్రసాదాలతో సత్కారం

కె.వి. గోపాలరావు కార్య నిర్వహణ అధికారి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కొల్లేటికోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారు దేవస్థానమునకు గుంటూరు కి చెందిన ఎన్ పిచ్చయ్య వారి కుటుంబ సభ్యులు కేజీ 4.866.OOO గ్రాముల వెండి కిరీటం కానుకగా ఆలయ కార్య నిర్వహణ అధికారి వారికి అందజేశారు. వారికి శ్రీ అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించి శేష వస్త్రములతో వారిని సత్కరించి, ఆశీర్వచన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఉప ప్రధాన అర్చకులు పెటేటి పరమేశ్వరరావు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి గోపాలరావు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author