PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం లోని శ్రీ బీరప్ప స్వామి సదనం… దాతలకు ఎలాంటి ఇబ్బంది లేదు    

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీశ్రీ శ్రీ  అఖిలభారత కురువంశ నిత్య అన్నదాన సత్రం విషయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ దాతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన కొంతమంది వారి మాటలు నమ్మవద్దని కర్నూలు జిల్లాకు చెందిన శ్రీ శ్రీ శ్రీ అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రం ,శ్రీశైలం , రిజిస్టర్ నెంబర్ 127/ 89 వారి  నిర్వహణ విషయంలో దాతలు అందరికీ తెలుసు,  దాతలను ఎలా గౌరవించామో అందరికీ తెలుసని శ్రీశ్రీ అఖిలభారత కురువంశ నిత్య అన్నదాన సత్రం అధ్యక్షులు ఎం .కే . రంగస్వామి ,సభ్యులు గుడిసె శివన్న వెంకటేశ్వర్లు దేవేంద్ర కర్నూలు నగరంలో కురువ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు .వారు మాట్లాడుతూ కొంతమంది హైదరాబాద్ కు  చెందిన శ్రీ బీరప్ప స్వామి సాధనం Reg .No.457/ 2006  కలిగిన కొంతమంది వ్యక్తులు సత్రం నిర్వహణ చేసిన రోజుల్లో అక్కడికి వచ్చిన భక్తులను అలాగే దాతలను ఎలా ఇబ్బంది పెట్టారో భోజన విషయంలో కానీ రూమ్ ల విషయంలో గానీ అక్కడ నిర్వాణకు ఉంచిన కురువలు కాకుండా ఇతర కులస్తులను మేనేజర్ గా ఉంచి వారు ప్రవర్తించిన తీరు దాతలు అందరికీ తెలుసు మీరు వేరే చెప్పనవసరం లేదని అలాగే ఎంపీ గోరంట్ల మాధవ్ ,సిపిఐ రామచంద్రయ్య, గడ్డం రామకృష్ణ సత్రం రిపేరు విషయంలో సలహాలు సూచనలు ఇచ్చేందుకు అలాగే వీలైనంత తొందరగా రిపేరు పూర్తి చేయమని సత్రాన్ని సందర్శిస్తే దానికి మాపైన రామచంద్రయ్య గడ్డం రామకృష్ణ గుడిసె శివన్న రంగస్వామి వెంకటేశ్వర్లు మరికొంత మంది పై మా సత్రాన్ని మెము స్వాధీనం చేసుకుంటే ఎస్పీకి తెలంగాణకు చెందిన కొంతమంది ఫిర్యాదు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము. కర్నూలు జిల్లాకు చెందిన రిజిస్టర్ నెంబర్ 127/89 శ్రీ శ్రీ శ్రీ అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రం నిర్వాహకులు   పేర్కొన్నారు. ఆ సత్రం విషయంలో కోసికే  శ్రీనివాసరావు , బన్నె బుచ్చప్ప లకు సంబంధం లేనప్పటికీ కొంతమంది వ్యక్తులను అడ్డం పెట్టుకుని సత్రం ను సత్రంలా కాకుండా మరోలా నడిపారనేది శ్రీశైలంలో ఎవరిని అడిగిన చెబుతారనేది నగ్నసత్యం. ఈరోజు మీ ఆదాయానికి లోటు పడిందని దాతలను  రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేయడం సబబు  కాదని వారు పేర్కొన్నారు. దయచేసి దాతలకు విన్నవించేది ఏమంటే కోసికె  శ్రీనివాసరావు, బన్నె బుచ్చప్ప మరి కొంతమంది చెప్పే మాటలు నమ్మి దాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సత్రం రిపేర్ లో ఉన్నది వీలైనంత తొందరలో రిపేరు చేసి మీకు సమాచారం అందజేస్తాం అంతవరకు సత్రంలో రూములు ఇవ్వడానికి కుదరదు. కావున దాతలు గమనించి ఎవరో చెప్పే రెచ్చగొట్టే వ్యాఖ్యలు నమ్మవద్దని మీకు సత్రం విషయంలో ఎలాంటి సమాచారం కావాలన్నా 9032741194,  9440756199  సంప్రదించాల్సిందిగా కోరుచున్నాము.

About Author