భయపడొద్దు.. వాళ్లకు చుక్కలు చూపిద్దాం..!
1 min read
పల్లెవెలుగు వెబ్: తెదేపాను ఇబ్బంది పెట్టే వారు.. 10 రెట్లు ఎక్కువ ఇబ్బందిపడతారని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. తప్పు చేసిన వాళ్లకు చుక్కలు చూపిస్తామన్నారు. కేసులకు భయపడొద్దని నేతలకు చెప్పారు. ధైర్యంగా పోరాడే వాళ్లకే భవిష్యత్తులో ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. జగన్ పాలనంతా… అబద్ధాల మీద జరగుతోందని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహానాడు వేదికగా పిలుపునిచ్చారు. ఏపికి పోలవరం, అమరావతి రెండు కళ్లని, అమరావతి కంటిని పొడిచేశారని… పోలవరానికి కూడ అదే గతి పట్టోబోతోందని దుయ్యబట్టారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ వారి కళ్లకు గంతలు కడుతోందని విమర్శించారు.