ఓటమికి భయపడొద్దు.. అధిగమిస్తేనే విజయం
1 min read
పల్లెవెలుగువెబ్ : ఓటమిని చూసి భయపడకూడదని.. దానిని అధిగమించి పోరాడితే విజయం చేకూరడం ఖాయమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ‘పరాజయానికి వ్యతిరేకంగా పోరాడితే పోయేదేమీ లేదు ఓటమి తప్ప’ అంటూ కవితాత్మక ధోరణిలో వ్యాఖ్యానించారు. ఓటమిని తేలిగ్గా తీసుకునేలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని, అలా ముందుకు సాగినప్పుడే విజయం సాధించగలుగుతామన్నారు. ఇది అన్ని విషయాల్లో అందరికీ వర్తిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పునరుజ్జీవం, ప్రజలతో మమేకం కావడానికి ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో రాహుల్ బుధవారం కన్యాకుమారిలో ప్రారంభించిన పాదయాత్రను గురువారం రెండో రోజు ఉదయం 7.15 గంటలకు మొదలుపెట్టారు.