పరీక్షలంటే భయపడకండి.. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి
1 min readజిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం. భ్రమరాంభ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పరీక్షలు అంటే భయం ఎదుకు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా పరీక్షలు రాస్తే తగిన ఫలితాలు సాధిస్తారని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలప్రధానోపాధ్యాయురాలు ఎం బ్రమరాంబ పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థినిలకు ధైర్యం నూరి పోశారు.పత్తికొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10 తరగతి విద్యార్థినిలకు స్కూల్ హెచ్ .యం. భ్రమరాంభ హాల్ టిక్కెట్ లను పంపిణీ చేశారు. అలాగే 10 తరగతి విద్యార్థినిల అందరికీ పెన్నులను పంపిణీ చేశారు. ఈనెల18 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 10 తరగతి పబ్లిక్ పరీక్షలకు హజరుకాబోయే విద్యార్థినిలతో ఆమె మాట్లాడుతూ, పరీక్షలు అంటే భయ పడరాదు.పరీక్షలంటే ఒక పండగవాతావరణం ప్రతి విద్యార్థి మనసులో అనుకొని ఆనందంగా పరీక్షకు హాజరై విజయం సాధించాలని అన్నారు.ఇష్టం తో చదివితే ప్రతి విషయం బాగా గుర్తు ఉంటుందని అన్నారు. కష్ట పడటమే కాదు,చదువు పైన ఇష్టం కూడా ఉండాలన్నారు.ఇష్టపడి చదివి ,పరీక్షలు బాగా రాసి ,అందరూ ఉతీర్ణత సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు కొత్తపల్లి సత్యనారాయణతో పాటు విద్యార్థినిలు పాల్గొన్నారు.