పరీక్షలంటే భయపడవద్దు .. ధైర్యంగా పరీక్షలు రాయాలి
1 min read– ప్రశ్నాపత్రం చూడగానే భయపడకూడదు
– సహచర విద్యార్థులతో మన చదువును అస్సలు పోల్చుకోవద్దు
– పదో తరగతి పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పరీక్షలంటే భయపడవద్దని దైర్యంగా పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఆత్మవిశ్వాసం తో సిద్ధం కావాలని ఎస్ఎఫ్ ఐ నందికొట్కూరు డివిజన్ అధ్యక్షుడు శివ అన్నారు. జూపాడుబంగ్లా మండలంలో ఏపీ మోడల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో ఎస్ఎఫ్ఐ ,యూటీఎఫ్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం ప్రజ్ఞా వికాస్ టాలెంట్ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన విద్యార్థులకు జ్ఞాపకాలను అందజేశారు . ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి నందికొట్కూరు డివిజన్ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు కే.శివ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 3న జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల లో అందరూ మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని భవిష్యత్తులో అందరూ మంచి స్థాయిలో ఉండలన్నారు.బాలికలు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు .అనంతరం విద్యార్థులకు పదో తరగతి పరీక్షల పై విద్యార్థులకు పలు సూచనలు సూచించారు.పరీక్షలంటే భయపడవద్దని ధైర్యంగా పరీక్షలు రాయాలన్నారు .ప్రశ్నాపత్రం చూడగానే భయపడకూడదన్నారు.సహచర విద్యార్థులతో మన చదువును అస్సలు పోల్చుకోవద్దని సూచించారు..అర్ధరాత్రి వరకు చదవడం అస్సలు మంచిది కాదని రాత్రి 10.30 గంటలకు నిద్రపోయి 5.30 గంటలకు నిద్ర లేవాలన్నారు. ప్రతి రోజు కనీసం 7 గంటలైనా నిద్రపోవాలన్నారు. అల్పాహారం తీసుకున్న తర్వాతనే చదవాలని ఏకాగ్రతను దెబ్బతీసే విషయాలను దూరంగా ఉండాలన్నారు.చదువుకునేటప్పుడు సెల్‌ఫోన్లు, టీవీలు స్విచ్ ఆఫ్ పెట్టాలని పరీక్షకు వెళ్లే ముందు హాల్‌టికెట్ ఉందో లేదో సరిచూసుకుని, ఖచ్చితంగా తీసుకెళ్లాలి.పరీక్షకేంద్రాలకు కనీసం అరగంట ముందైనా వెళ్లి, హాల్‌టికెట్ నంబర్లు చూసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో జుపాడు బంగ్లా మండల అధ్యక్షుడు, కార్యదర్శులు ఆంజనేయులు,ఫైరోజ్, నవీన్, ప్రియ, ఫర్హానాబేగం. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.