NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధైర్యపడవద్దు అండగా ఉంటా….

1 min read

– నియోజకవర్గ కాపు నాయకుడు…సురేష్ తండ్రికి..సాయినాథ్ శర్మ భరోసా
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : నియోజకవర్గ కేంద్రమైన కమలాపురం పడమటి వీధిలో నివాసం ఉంటున్న   కమలాపురం నియోజకవర్గం కాపు      జె ఏ సి. కన్వీనర్ జొన్నలగడ్డ సురేష్ తండ్రి బాలసు బ్బన్న  అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతుండడంతో కమలాపురం నియోజకవర్గం ప్రజా సేవకుడు నిరుపేదల నాయ కుడు రాష్ట్ర టిడిపి మాజీ కార్యదర్శి, పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ  మంగళవారం ఉదయం వారి ఇంటికి వెళ్ళి ఆయనను  పరామర్శించారు. బాల సుబ్బన్నకు ధైర్యం చెప్పి మెరుగైన వైద్య సదుపాయాలు అందేటట్లు చూస్తానని తెలిపారు. అన్ని విధాల నేనున్నానని సాయినాథ్ శర్మ  వారికి భరోసా ఇచ్చారు.  జొన్నలగడ్డ సురేష్ మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్నవారికి నేనున్నానంటూ సాయన్న పలకరింపు తమకు కొండంత మనో ధైర్యాన్ని అందిస్తుందన్నారు. అనుచర గణానికి ఏ కష్టం వచ్చినా ఆపన్న హస్తం అందిస్తారన్నారు.

About Author