NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ నేతల మాయమాటలు నమ్మొద్దు: టీజీ భరత్

1 min read

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన మహిళలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ ఐదేళ్ల పాలనను చూసి విసుగు చెందిన ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని టీడీపీ కర్నూల్ నియోజకవర్గ ఇంఛార్జ్ టీజీ భరత్ అన్నారు. నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో టీడీపీ నేత దేవా ఆధ్వర్యంలో టీజీ భరత్ సమక్షంలో పెద్ద ఎత్తున మహిళలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి వారిని టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ప్రజల ఆదాయం ఏమాత్రం పెరగలేదు గానీ.. ఖర్చులు మాత్రం భారీగా పెరిగాయని విమర్శించారు. మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మళ్లీ ఓట్ల కోసం వైసీపీ నాయకులు వస్తున్నారని.. అలాంటి వారిని నమ్మద్దని ప్రజలకు సూచించారు. తాను మాత్రం ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా మంచి చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తనను గెలిపిస్తే.. కర్నూల్‌లో ఉన్న ప్రతి ఒక్కరి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు రోజు ఉపాధి.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెస్తామన్నారు. ప్రజలు ఆలోచించి టీడీపీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో ప్రభావతి, రేణుక, జంభావతి, అమాలమ్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగారాజు యాదవ్, సీనియర్ నేతలు మన్సూర్ అలీఖాన్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు మారుతి శర్మ, సౌభాగ్యమ్మ, నాయకులు శ్యామ్, బూత్ ఇంఛార్జీలు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author