PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేతన జీవుల వెతలు పట్టించుకోరా..

1 min read

– బి మాధవ స్వామి జిల్లా అధ్యక్షులు ఎపిటిఎఫ్.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లకు 9వ తేదీ దాటిన జీతాలు రాకపోవడం దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండడం వల్ల వేతన జీవులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీతాలు వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి. మాధవ స్వామి డిమాండ్ చేశారు. స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి నెల జీతాలు ఆడుకోవడం పరిపాటయిందని రాజ్యాంగ ప్రకారం ఉత్తర్వులు ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు వేయాల్సి ఉండగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను పెన్షన్లను ఇబ్బందులను గురిచేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా జీతాలు వేయకపోతే నిరసన చేయడానికి వెనకాడ బోమని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రతినెల ఇంటి ఖర్చులు బ్యాంకు లోన్లు ఖర్చులన్నీ చెల్లించుటకు అనేక ఇబ్బందులు పడుతున్నారని కనుక ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు ఎం. మధుసూదన్ రావు జిల్లా ఉపాధ్యక్షులు జి.లింగమయ్య, రాష్ట్ర కౌన్సిలర్లు డి.నాగరాజు వి. సుబ్బరాయుడు పి. సుబ్బరాయుడు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,జె. వెంకట కృష్ణుడు ఇ.సుంకన్న, రమేష్ చాంద్ భాష , పోలియో నాయక్, రఫీ ,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author