ఆత్మహత్యలు వద్దు-పట్టుదలే ముద్దు : యుటిఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మార్కుల కన్నా జీవితం చాలా విలువైనదని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి యస్.నరసింహులు అన్నారు.శుక్రవారం స్థానిక మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయిన నేపథ్యంలో విద్యార్థిని విద్యార్థులు ఫలితాలను చూసి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమని,విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో,తక్కువ మార్కులు వచ్చాయనో మనస్తాపానికి గురై మానసిక వేదనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.మన జీవితం మనకు ఎప్పుడూ సవాళ్ళను విసురుతూనే ఉంటుందనీ, వాటిని దైర్యంగా ఎదుర్కొని నిలిస్తేనే విజయం మన సొంతం అవుతుందనీ,ఓడినంత మాత్రాన నిరుత్సాహ పడకుండా గుండెలనిండా మనో దైర్యం నింపుకుని అకాశమే హద్దుగా చెలరేగాలి అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చెదించగలరని చదువుకునే విద్యార్థులకు సూచించారు.పదవ తరగతి మార్కులు,ఇంటర్మీడియట్ మార్కులు ముఖ్యం కాదు చిన్న కారణాలకు విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అలాంటివి చేసుకొని మీ విలువైన జీవితాలను మధ్యలో అర్ధాంతరంగా ఆపివేయవద్దు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దు..పరీక్షల్లో ఫెయిల్ అయితే చాలా మార్గాలు ఉంటాయి ఇవి మనకు ఉన్నత స్థాయిలో విజయం సాధించడానికి ఉపయోగపడుతాయని సూచించారు.