ఎన్నికల దృష్ట్యా ఎగ్జిబిషన్ నిర్వహించొద్దు.. టిడిపి కార్పోరేటర్లు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కర్నూలు నగరంలో ఎగ్జిబిషన్‌ను నిర్వహించొద్దని తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్లు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. గతంలో 2014 మరియు 2019 ఎన్నికల సమయంలో కూడా ఎగ్జిబిషన్ పెట్టలేదని కమిషనర్‌తో చెప్పినట్లు కార్పోరేటర్లు తెలిపారు. ఈ ఎన్నికల సంవత్సరంలో కూడా అదే పద్దతి పాటించాలని కోరామన్నారు. మార్చి1 నుండి మే 31వరకు ఎగ్జిబిషన్ నిర్వహణకు చేపట్టబోయే టెండర్ ప్రక్రియను నిలిపివేయాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎగ్జిబిషన్ నిర్వహించడం వల్ల అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని కమిషనర్‌కు వివరించినట్లు కార్పోరేటర్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కురువ పరమేష్, కార్పోరేటర్లు జకియా అక్సారీ, విజయకుమారి, కైప పద్మలతా రెడ్డి, మాజీ కార్పోరేటర్లు సుంకన్న, పామన్న, బొల్లెద్దుల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.