సైబర్ నేరగాళ్ళ వలలో మోసపోవద్దు:ఎస్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: సైబర్ నేరగాళ్ల వలలో పడి ప్రజలు ఎవ్వరూ కూడా మోసపోవద్దని మిడుతూరు ఎస్ఐ ఎం.జగన్ మోహన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల ఫోన్ నెంబర్లు తీసుకొని వారికి ఫోన్ చేసి మేము విజయవాడ హెడ్ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాము అని పేరు వివరాలు తెలుసుకొని తర్వాత నీకు కేటాయించిన క్లస్టర్ లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి.అందరికీ జగనన్న విద్యా దీవెన పథకం లేదా వేరే ఏదైనా పతకం కింద డబ్బు అందుతోందా అని అడుగుతారు.అలా వాలంటీర్ ను అడిగి ఎవరికైతే స్కీమ్ కింద డబ్బులు పడవో వారి పేరు వివరాలు,ఫోన్ నెంబర్ ను వాలంటీర్ ద్వారా తీసుకొని వాలంటీర్ ఫోన్ కాల్ ను హోల్డ్ లో పెడుతూ అవతలివారికి ఫోన్ చేస్తారు.ఒకవేళ అవతలివారు నమ్మనియెడల అప్పటికే లైన్లో ఉన్నట్టి వాలంటీర్ తో కాన్ఫరెన్స్ కింద కలిపి నమ్మబలికి మాట్లాడుతారు.తద్వారా లబ్దిదారునికి ఎందుకు డబ్బులు పడలేదో కారణం తెలుసుకొని మీకు పలానా కారణం వలన డబ్బులు పడలేదు ఇప్పుడు దానిని కరెక్షన్ చేస్తున్నాము మీకు డబ్బులు పడతాయి అని నమ్మబాలికి వారి ఫోన్ పే యూపీఐ నంబర్ తెలుసుకొని తద్వారా వారి అకౌంట్ నుండి డబ్బును బదిలీ చేసుకుంటారని ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా సరే ఫోన్ చేస్తే మీ వివరాలు చెప్పవద్దని ఎస్ఐ తెలిపారు.