అనాధ అన్న భావన రాకూడదు
1 min read– అనాధ పిల్లలను హక్కున్న చేర్చుకుందాం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కన్న పేగును తెంచుకుంటున్న వైనం.. మాతృత్వాన్ని ప్రశ్నించేలా ఉంది. పిల్లల పట్ల ఆప్యాయత, అనురాగం, ప్రేమను పంచాలి ముళ్ల పో దలు, చెత్త కుప్పలు నడిరోడ్డుపై పసి పిల్లలను వదిలేసిన ఘటనలు చోటు చేసుకోవడం వల్ల పేగు బంధాన్ని తెంచేసుకుంటున్న కసాయి తల్లిదండ్రుల వల్ల అనాధగా మారిన పిల్లలను అక్కున చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూల్ నగరంలోని సి క్యాంప్ సెంటర్ నందు ప్రత్యేక దత్తత కేంద్రం, జిల్లా బాలల సంరక్షణ విభాగం, జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ నందు చిన్నారులకు పాల డబ్బాలను, దుస్తులను వైద్యులు శంకర్ శర్మ అంద చేశారు. వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ అనాధ అన్న భావన వారిలో రాకుండా ఆప్యాయత అనురాగం ప్రేమను పంచుతూ సొంత బిడ్డల్లా చూసుకోవడం మంచిదేనన్నారు. కన్న పేగును తెంచుకుంటున్న వైనం మాతృత్వాన్ని ప్రశ్నించేలా ఉందని, ముక్కుపచ్చలారని పిల్లలు చెత్త కుప్పలో పడేయడం బాధాకరమన్నారు. మాతృ ప్రేమను నోచుకోని పసి మొగ్గలు. కన్నతల్లి ముర్రిపాలనోచుకోని ఈ శిశువులను పోషక లోపం అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సి ఉందన్నారు. అనాధ చిన్నారులకు అమ్మ ప్రేమను అందిస్తున్న వారికి కృతజ్ఞతలు చెప్పారు.