PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ వీఆర్వో మాకొద్దు..

1 min read

– వీఆర్వో మౌళి భాషను బదిలీ చేయండి..
– ఆర్డీవో కు మొరపెట్టుకున్న బిజినవేముల ప్రజలు.
– మూడు నెలలుగా అందని రేషన్..
– గ్రామంలో విచారణ చేపట్టిన ఆర్డీవో .
– మూడు నెలల రేషన్ పంపిణీ చేయాలని ఆదేశం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వీఆర్వో మౌళి భాష మాకొద్దు అంటూ నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామస్తులు ఆత్మకూరు ఆర్డీవో యం. దాసు ఎదుట మొరపెట్టుకున్నారు. గురువారం గ్రామానికి విచారణ నిమిత్తం వచ్చిన ఆయనకు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని గ్రామానికి చెందిన సుధాకర్, మధు బాబు,పెద్దయ్య, ముగ్గు సుధాకర్, చికెన్ శ్రీను, చిన్న వెంకటరమణ, మధు, ఈరన్న, శంకర్, లక్ష్మి, సువర్ణ, లింగమ్మ, లలితమ్మ, పార్వతమ్మ, లు ఆర్డీవో కు ఫిర్యాదు చేశారు. “పండగ పూట పస్తులేనా” అనే శీర్షికన గురువారం పల్లెవెలుగు దిన పత్రిక లో వార్త కధనం వెలువడిన విషయం తెలిసిందే.స్పందించిన రెవిన్యూ అధికారులు ఆర్డీవో యం.దాసు, నందికొట్కూరు తహశీల్దార్ రాజశేఖర్ బాబు గురువారం గ్రామంలో విచారణ చేపట్టారు.మూడు నెలల నుంచి రేషన్ బియ్యం అందడం లేదని ఒకటి, రెండు, మూడు వార్డులో దాదాపు 45 మందిని అధికారులు గుర్తించారు. ప్రతి ఒక్కరికీ మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని రేషన్ డీలర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు. రేషన్ దుకాణంలో స్టాక్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వీఆర్వో ను బదిలీ చేయాలని కోరారు. వీఆర్వో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని కుల, ఆదాయ ధ్రువపత్రాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు. వీఆర్వో మౌళి బాష పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతామని అన్నారు. ఆర్డీవో వెంట డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి, వీఆర్వో జగదీష్, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

About Author