PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇప్పుడే రాజకీయాలొద్దు… మంచిగా చదువుకో!

1 min read

– బాలుడికి నచ్చజెప్పి పంపించేసిన యువనేత
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: యువగళం పాదయాత్రలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చేసుకుంది. ఆలూరు నియోజకవర్గం పుప్పలదొడ్డిలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ఓ బుడతడు పసుపురంగు టీషర్టుతో ఉత్సాహంగా యాత్రలో అడుగులు వేస్తున్నాడు. ఇది గమనించిన యువనేత లోకేష్ ఆ బాలుడ్ని దగ్గరకు తీసుకొని అప్యాయంగా పలకరించి కుశలప్రశ్నలు వేశారు. అప్పుడే రాజకీయాలు వద్దు, ముందు మంచిగా చదువుకోవాలని చెప్పి టీషర్టు తీయించి నచ్చజెప్పి పంపించేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ లబ్ధిపొందేందుకు తహతహలాడుతున్న ఈరోజుల్లో బాలుడి భవిష్యత్ కోసం దూరదృష్టితో ఆలోచించారు యువనేత లోకేష్.

About Author