NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముంబై పై ద్వేషం చూపించొద్దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ముంబైలోని వివాదాస్పదమైన మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టు పనులును ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం ప్రారంభిస్తోంది. దీంతో మాజీ మంత్రి ఆదిత్య థాక్రే మా పై ఉ‍న్న ద్వేషాన్ని ముంబై పై చూపించొద్దు అంటూ అభ్యర్థించారు. మెట్రో కార్‌షెడ్‌ ప్రాజెక్టు కోసం పచ్చని అటవీ ప్రాంతన్ని నాశనం చేయవద్దని కోరారు. ఆరే అనే అటవీ ప్రాంతంలో ఈ మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయితే ఇది సుమారు 800ల ఎకరాలకు పైగా ఉన్న అటవీ ప్రాంతం. చుట్టు పక్కల చిరుతలు వంటి ఇతర చిన్న జాతులు సంచరిస్తూ ఉండే ఆహ్లదభరితమైన ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో నాశనం చేయవద్దని థాక్రే విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ విషయమై పర్యావరణ కార్యకర్తలు భారీ నిరసనలు చేపట్టిన సంగతిని సైతం ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మెట్రో కార్ షెడ్ కోసం గుర్తించిన ప్రాంతం జీవవైవిధ్యం లేదా అటవీ భూమిగా వర్గీకరించబడలేదని, మెట్రో కార్బన్ని తగ్గిస్తుందంటూ వాదించారు.

                                         

About Author