PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశంలో మాలల యొక్క మనోభావాలు దెబ్బతీయద్దు..

1 min read

మాల మహాసేన జాతీయ అధ్యక్షుడు అలగ రవికుమార్..

రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరికి  వినతి

పల్లెవెలుగు వెబ్  ఏలూరు  : ఈ దేశంలో అధిక సంఖ్యలో ఉన్న మాలలు మరియు మాల ఉపకలాలు వారి మనోభావాలు దెబ్బతీయొద్దని మాలల ఆగ్రహానికి బిజెపి ప్రభుత్వం గురి కావద్దని మాల మహాసేన జాతి అధ్యక్షులు ఆలగ రవికుమార్ అన్నారు. శనివారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  దగ్గుపాటి పురందరిశ్వరి ని కలిసి వినత పత్రం అందించారు.  ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని గౌరవ ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఎస్సీల సంఖ్య గణనీయంగా పెరిగిన కారణంగా రిజర్వేషన్ శాతాన్ని పోరాడి పెంచుకోవలసిన తరుణంలో స్వార్థంతో ప్రవర్తించడం సరికాదన్నారు. కులగణన తర్వాత బీహార్ రాష్ట్రంలో 15% ఉన్నటువంటి రిజర్వేషన్ను 20 శాతానికి పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 25 శాతానికి పెంచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల పరిస్థితి కడు దుర్భరంగా ఉందని అన్నారు. సుమారు 27 దళిత సంక్షేమ పథకాలను తీసివేశారని ఎస్సీ కార్పొరేషన్ నిధులను సుమారు 59 వేల కోట్ల రూపాయలను ఇతర పథకాలకు మళ్ళించారని అంబేద్కర్ విదేశీ విద్య డస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇలాంటి వాటిపై ఒక పాదం మోపుతున్నారని అన్నారు. దళిత వ్యతిరేక పాలనపై అనేక దళ సంఘాలు గళమెత్తుతున్న మంద కృష్ణ మాదిగ ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. రావలసిన పథకాలు నిర్వీర్యం అవుతుంటే నిమ్మకు నీరు వచ్చినట్టు ఎందుకున్నారని  ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా దళితులకు దళిత యువకులకు ప్రత్యేకమైన పథకాలు ఉపాధి మార్గాలు ద్వారా దళిత ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని ఆమెను కోరారు. వినతి పత్రం అందించిన వారిలో మాల మహాసేన ప్రధాన కార్యదర్శి సరిపల్లి పెద్దిరాజు, మాల మహాసేన సలహాదారులు తోట రాజు, మండల యూత్ ప్రెసిడెంట్ బట్టు బద్రి వినతి పత్రం అందించిన వారిలో ఉన్నారు.

About Author