ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు..
1 min read
రైతులకు పరికరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహించవద్దని ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలనిప్రజలను కార్యాలయాల చుట్టూ అదే పనిగా తిప్పుకోవద్దని గ్రామాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల వద్ద నుండి 20 వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు.తర్వాత మండల పరిషత్ ప్రాంగణంలో వ్యవసాయ యంత్ర పరికరాలను 20 మంది రైతులకు 40 మరియు 50% సబ్సిడీ కింద పరికరాలను ఎమ్మెల్యే అందజేశారు. మహిళలకు ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి దశరథ రామయ్య,తహసిల్దార్ టి శ్రీనివాసులు,సీడీపీఓ కోటేశ్వరమ్మ,మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,మండల వ్యవసాయ అధికారి ఎం పీరునాయక్,ఈఓఆర్డి సంజన్న,మండల అధికారులు మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
