NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ మా కాల‌నీలో ముద్దులు పెట్టుకోవ‌ద్దు ’ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో పార్కింగ్.. ఇలాంటి బోర్డులు చూశాం. విన్నాం. కానీ.. నో కిస్సింగ్ జోన్ బోర్డు ఏంట‌ని ఆశ్చర్యపోతున్నారా?. అవును.. ముంబ‌యిలోని స‌త్యం శివం సుంద‌రం సొసైటీలో నో కిస్సింగ్ బోర్డు పెట్టారు. లాక్ డౌన్ సంద‌ర్భంలో బోరివ‌లి ప్రాంతంలోని స‌త్యం శివం సుంద‌రం సొసైటీలో సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో జంట‌లు వ‌చ్చి బ‌హిరంగంగా ముద్దులు పెట్టుకోవ‌డం ప్రారంభించారు. దీంతో విసిగిపోయిన స్థానికులు ఒక‌సారి చెప్పి చూశారు. ప్రేమ జంట‌లు మాట విన‌క‌పోవ‌డంతో నో కిస్సింగ్ జోన్ అని బోర్డు పెట్టారు. ఈ విష‌యాన్ని స్థానిక కార్పొరేట‌ర్, పోలీసుల‌కు కూడ ఫిర్యాదు చేశారు. కిటికీ తెర‌వ‌గానే కిస్సింగ్, రొమాన్స్ సీన్లు చూడ‌లేక నో కిస్సింగ్ జోన్ ప్రక‌టించామ‌ని సొసైటీ నివాసితులు చెబుతున్నారు.

About Author