NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గృహనిర్మాణాల్లో నిర్లక్ష్యం వహించొద్దు…

1 min read

సత్వరమే చిన్న చిన్నపనులు పూర్తి చేసి

లబ్ధిదారులకు అప్పగించాలి -ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు  : కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాదరెడ్డి ఆదేశాల మేరకు కనపర్తి జగనన్న లే అవుట్ను ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, హౌసింగ్ డీఈ గంగన్న, ఏఈ మేనిల్ లతో కలసి బుధవారం అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించడం జరిగింది, ఈ సందర్భంగా ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ, జగనన్న ఇంటి నిర్మాణాల విషయంలో అధికారులంతా సమన్వయంతో పనిచేసి చిన్న చిన్న పనులు ,డోర్లు, కిటికీలు, బాత్రూములు వంటివన్నీ పూర్తిచేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నెల ఆఖరి కల్లా లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేయాలని ఆయన తెలిపారు, అదేవిధంగా కాంట్రాక్టర్ ప్రేమ సాగర్, గృహ నిర్మాణ ఇంజనీర్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారులు చొరవ తీసుకుని పనులు వేగవంతంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు, అదేవిధంగా వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఈనెల ఆఖరి కల్లా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించడం జరిగింది, ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఇ గంగన్న, హౌసింగ్ ఏ ఈ, మేనిల్, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author