ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు : ఎమ్మెల్యే గిత్త..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/4-8.jpg?fit=550%2C351&ssl=1)
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దని సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అధికారులతో చరవాణిలో అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకుప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్)లోభాగంగా శనివారం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో ప్రజల నుండి ఎమ్మెల్యే ఫిర్యాదులను స్వీకరించారు. రెవెన్యూ మరియు వివిధ రకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కు వివరించగా ఆయా శాఖల సంబంధిత అధికారులతో ఫోన్ లో ఎమ్మెల్యే మాట్లాడారు.ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.