గొడవలతో జీవితాలను.. నాశనం చేసుకోవద్దు..
1 min read
కడుమూరులో ప్రశాంత జీవనంపై సీఐ సుబ్రహ్మణ్యం అవగాహన..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : చిన్నపాటి విషయాలకు గొడవలు చేసుకోవడం ఒకరికొకరు కొట్టుకోవడం వల్ల జీవితాలు నాశనం అవుతాయని నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో బుధవారం సాయంత్రం 5:30 కు ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర సీఐ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పాత విషయాలను గుర్తుపెట్టుకుని ఇతరులు మమ్మల్ని ఏదేదో అంటున్నారని మీరు గొడవలకు దిగవద్దని ఏమైనా చిన్నపాటి సమస్యలు ఉంటే గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పరిష్కరించుకోవాలి.ఒకవేళ అక్కడ పరిష్కారం కానీ సమస్య ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.గొడవలు ముఖ్యం కాదు పిల్లల్ని మంచిగా చదివిస్తూ వారి జీవితానికి పునాది బాట వేయాలని సీఐ ప్రజలకు సూచించారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని ఏమాత్రం అనుకోని సంఘటన జరిగితే మీ పిల్లల్ని మీరే చేతులారా దూరం చేసుకున్న వారు అవుతారు వాటిని దృష్టిలో పెట్టుకొని వాహనాలు వారికి అప్పగించవద్దు అంతే కాకుండా బైకులు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనాలకు తప్పనిసరిగా లైసెన్సు మరియు పత్రాలు ఉండాలంటూ మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.