NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళారులను నమ్మవద్దు.. మోసపోవద్దు

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: దళారులను నమ్మి మోసపోవద్దు అని మహానంది మండల తాసిల్దార్ జనార్ధన్ శెట్టి హెచ్చరించారు. మిషన్ వాత్సల్య పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టిందని దీనిని తల్లి లేక తండ్రి మరణించి ఉన్న లేక ఇద్దరు మరణించి ఉన్న వారికి సంబంధించి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నవారికి వర్తిస్తుంది అని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా తల్లి లేదా తండ్రి/ ఇద్దరు మరణించిన వారి పిల్లలకు సంబంధించి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయ సహకారాలు అందుతాయని ఈ అవకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే కొన్నిచోట్ల గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తులు రూ 1000 పైకం వసూలు చేస్తున్నారని సర్టిఫికెట్లు ఇప్పించడంతోపాటు దరఖాస్తు ఫారం కూడా ఇస్తామని అనంతరం చర్యలు తీసుకోవడానికి కూడా సహకరిస్తామని ప్రచారం చేస్తున్నారని తాసిల్దార్ ను దీనిపై వివరణ కోరగా అలాంటి వారి మాటలను నమ్మవద్దని అర్హులైన వారందరికీ ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్లతోపాటు దరఖాస్తు చేసిన అనంతరం నిక్కచ్చిగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకం/ పథకాలు అదే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ సిబ్బంది కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అర్హులైన వారిని గుర్తించి వచ్చిన దరఖాస్తును వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తాసిల్దార్ కార్యాలయంలో కూడా దరఖాస్తులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని దళారులను నమ్మి మోసపోవద్దని తాసిల్దార్ జనార్ధన్ శెట్టి హెచ్చరించారు. ఏవైనా సమస్య ఉంటే తమ దృష్టికి కానీ డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డి దృష్టికి కానీ తీసుకొని వస్తే పరిష్కరిస్తామన్నారు.

About Author