ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్న బీఎస్పీ పార్టీ
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బహుజన సమాజ్ పార్టీ గెలుపే ధ్యేయంగా ఇంటింటి ప్రచారం ముమ్మరం చేస్తామని బహుజన సమాజ్ పార్టీ నంద్యాల ఇంచార్జి గద్దల లాజర్, నందికొట్కూరు అసెంబ్లీ ఇంచార్జి లింగాల స్వాములు అన్నారు. ఆదివారం నందికొట్కూరు మండలంలో బీఎస్పీ పార్టీ తరుపున గ్రామలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకున్న సమస్యలు పరిష్కారం కావాలన్నా మన రాబోయే తరాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలన్న మనలను ఈ దేశ పాలకులను చేయడానికి ఏర్పాటు చేయబడిన బిఎస్పీ పార్టీని బలోపేతం చేసి ఏనుగు గుర్తుపైన ఓటు వేయాలని పిలుపునిస్తూ నందికొట్కూరు మండలం కోనేటమ్మ పల్లె బిజినవేముల గ్రామాలలో విస్తృత ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో అశోక్ శివ శ్రీను విజయ్ మనోజ్ వినయ్ వాసుదేవ్ పాల్గొన్నారు.