ఇంటింటి ఓటర్ల పరిశీలన పకడ్బందీగా జరుగుతోంది
1 min read– స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 పై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించండి :
– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 పై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 పై ఇంటింటి ఓటర్ల పరిశీలన పకడ్బందీగా జరుగుతోందని, ఓటర్ల జాబితాలో ఉన్న జంక్ క్యారెక్టర్స్, ఒకే ఇంట్లో పది మంది కంటే ఎక్కువ ఉన్న ఓటర్లు, 99 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వారిని పరిశీలించి ఫిజికల్ గా లేకపోతే తొలగించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఇల్లు లేని వాళ్లు, ట్రాన్స్జెండర్స్ ను గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీ ప్రతినిధిలకు సమస్యల పరిష్కారం నిమిత్తం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని డిఆర్ఓ, ఎన్నికల సూపరింటెండెంట్ ను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఓటర్ల ఇంటింటి సర్వే పై ప్రచారం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలో ఓటర్ల ఇంటింటి సర్వే ఇప్పటి వరకు కొంత శాతం మాత్రమే జరిగిందని ఇంటింటి సర్వేను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెల్దుర్తి, తుగ్గలి మండలంలో డెత్ కేసులు ఓటర్ల జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ను కోరారు. ఇతర పార్టీ ఏజెంట్లు వివరాలు కూడా అందజేయాలన్నారు. బూత్ స్థాయి అధికారులు వెరిఫై ఓటర్స్ లిస్టు ఇవ్వడంతో పాటు బూత్ స్థాయి అధికారులకు ఓటర్ల సర్వే యాప్ పై అవగాహన కల్పించాలని కోరారు.బీఎస్పీ పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ కర్నూలులో ఇంటింటి ఓటర్ల సర్వేను వేగవంతం చేయాలని కోరారు. అదే విధంగా సర్వేలో వాలంటీర్ల పాల్గొనకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.వైయస్సార్సీపి పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో డెత్ ఓటర్స్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ను కోరారు.సమావేశంలో డిఆర్ఓ నాగేశ్వరరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పుల్లారెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్తా , బిఎస్పి పార్టీ ప్రతినిధి వి.రాజేష్, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ ఎల్వి.ప్రసాద్, ఎన్నికల సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.