NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ‌బుల్ వేరియంట్.. డెల్మిక్రాన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ వేరింయ‌ట్ రూపంలో క‌రోన వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తుంటే.. ఇప్పుడు మ‌రో ఆందోళ‌న‌క‌ర వార్త వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుత కేసుల సంఖ్య ఒమిక్రాన్ వ‌ల్ల పెర‌గ‌డంలేద‌ని, డ‌బుల్ వేరియంట్ వ‌ల్లే కేసుల సంఖ్య పెరుగుతోంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. యూరప్, యూఎస్‌ సహా పశ్చిమాదిన కలకలం సృష్టిస్తున్నది ‘డెల్మిక్రాన్‌’ అనే డబుల్‌ వేరియంట్‌ అని, దీనికి డెల్టా తీవ్రత, ఒమిక్రాన్‌ వేగం ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022లో కరోనా రహిత ప్రపంచాన్ని చూడొచ్చన్న ప్రజల ఆశలకు ఈ డెల్మిక్రాన్‌ వమ్ముచేసిందంటున్నారు. పశ్చిమ దేశాల్లో కేసుల పెరుగుద‌ల‌కు ఇదే కారణమని కోవిడ్‌ పరిశోధకుడు డా. శశాంక్‌ జోషి అభిప్రాయపడ్డారు. ఆల్ఫా, బీటా లాగా డెల్మిక్రాన్‌ కరోనా కొత్త వేరియంట్‌ కాదని, ఇది ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో ఏర్పడిందని వివరించారు. అంటే దీన్ని డబుల్‌ వేరియంట్‌గా చెప్పవచ్చు. ఇలాంటి డబుల్‌ వేరియంట్లు రూపొందడం చాలా అరుదుగా జరుగుతుంది.

                                 

About Author