NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో కాపురం !

1 min read

పల్లెవెలుగువెబ్ : థాయ్ లాండ్ కు చెందిన ఓంగ్ డామ్ సోరోట్ ప్రసిధ్ద టాటూ ఆర్టిస్ట్. ఓంగ్ ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడ ప్రేమ వివాహాలే. తన భార్యలందర్నీ ఒప్పించి మరీ ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఓంగ్ సోరోట్, అతని భార్యలను థాయ్ కమెడియన్ ఒకరు ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఓంగ్ సోరోట్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమది ఎంతో అన్యోన్యమైన దాంపత్యమని, తన భార్యలు తనపై ఎంతో ప్రేమను కురిపిస్తారని చెప్పారు. ఎనిమిది మంది భార్యలు కూడ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఓంగ్ ఇంట్లో నాలుగు పడక గదులు ఉన్నాయి. వాటిలో ఒక్కో దానిలో ఇద్దరు భార్యలు కాపురం ఉంటున్నారు. ఎనిమిది మందిని కూడ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు ఓంగ్. మొదటి భార్యను స్నేహితుడి పెళ్లిలో, రెండో భార్యను మార్కెట్ లో, మూడో భార్యను హాస్పిటల్ లో.. నాలుగు , ఐదు, ఆరో భార్యలను ఇన్ స్టా, ఫేస్ బుక్, టిక్ టాక్ లలో, ఏడో భార్యను ఆలయంలో, ఎనిమిదో భార్యను విహారయాత్రలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

      

About Author